Home Page SliderTelangana

108 వాహనం చోరీ.. హైవేపై సినిమా తరహాలో ఛేజింగ్

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 108 వాహనాన్ని ఓ దొంగ చోరీ చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై సినిమా తరహాలో ఛేజింగ్ చేశారు. దీంతో అంబులెన్స్ సైరన్ మోగిస్తూ స్పీడుతో విజయవాడ వైపు పరారయ్యాడు. చిట్యాల వద్ద పట్టుకునేందుకు యత్నించగా.. ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. అనంతరం కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా ముందుకెళ్లాడు. టేకుమట్ల వద్ద రోడ్డుపై అడ్డంగా లారీలు పెట్టి పోలీసులు దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.