Andhra PradeshHome Page Slider

జిల్లాలో 1021 పోలింగ్ కేంద్రాలు

పాడేరు: జిల్లాకు 9,640 ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలు వచ్చాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం లను డిగ్రీ కళాశాల సమీపంలో కట్టుదిట్టమైన భద్రతతో భద్రపరిచామని పేర్కొన్నారు. 3700 బ్యాలెట్ యూనిట్లు, 2640 కంట్రోల్ యూనిట్లు, 3,100 వీవీప్యాట్లు వచ్చాయని చెప్పారు. అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశామని, వీటిలో 36 సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించామని పేర్కొన్నారు. జిల్లాలో 1021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా 13 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లలో 3,54,225 మంది పురుషులు, 3,80,213 మంది మహిళలు, 34 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. 40 వేల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారి, 24 వేల మృతుల ఓట్లను జాబితా నుండి తొలగించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, డీఆర్ఓ అంబేద్కర్, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.