Home Page SliderNational

మువ్వన్నెల జెండాకు 102 ఏళ్లు

భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించి నేటికి 102 సంవత్సరాలు అయ్యింది. దేశప్రజలంతా భక్తిగా సెల్యూట్ చేసే ఈ మువ్వన్నెల జెండాను మన తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించడం మనకు గర్వకారణం.స్వాతంత్య్రానికి పూర్వమే ఈ జెండా రూపకల్పనకు అంకురార్పణ జరిగింది. అప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై బ్రిటిష్ దేశ జెండాలను చూసిన గాంధీజీ మన దేశానికి కూడా పతాక రూపకల్పన చేయమని పింగళి వెంకయ్యను కోరారు. అదే ఈనాటి మన త్రివర్ణజెండా. జాతీయ జెండాను కాషాయ, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నం చిత్రించమని గాంధీజీ సూచించారు. అప్పటికి అదే భారత జెండాగా ఉండేది.

స్వాతంత్య్రానంతరం ప్రధాని నెహ్రూ సూచన మేరకు రాట్నానికి బదులు అశోకుని ధర్మచక్రం ఉంచారు. ఇలా మన జెండా రూపుదిద్దుకుంది. జెండాలోని కాషాయ రంగు త్యాగశీలురైన మన సైనిక బలగానికి, తెలుపు రంగు పవిత్రతకు, ఆకుపచ్చ రంగు పచ్చని మనదేశ రైతుల శ్రమకు, విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. అశోకుని ధర్మచక్రం భారతీయుల ధర్మనిరతికి సూచనగా చెప్పుకోవచ్చు. అలాంటి మన గొప్ప జాతీయ జెండాను చూసిన ప్రతీ భారతీయుని గుండెలో ‘విజయి విశ్వతిరంగా ప్యారా జెండా ఉంఛా రహే హమారా’ అనే పాట ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.