NewsTelangana

ఇకపై ఇంటర్‌లో 100% సిలబస్ అమలు

తెలంగాణాలో కొవిడ్ కారణంగా గత రెండు ఏళ్లలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా పాఠశాల నుంచి కళాశాల విద్య వరకు బోధన,పరీక్షల నిర్వహణలో కొత్త విధానాలు అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా విద్యార్థులు చదివే సిలబస్‌లను సైతం కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీంతో మొన్నటివరకు ఇంటర్ సిలబస్‌ 70% వరకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం కళాశాలలను ఆదేశించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ,రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కాగా ఇప్పుడు ఇంటర్‌లో 100% సిలబస్‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణాలోని అన్నీ ఇంటర్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం కాలేజీ యాజమాన్యాలు ఇంటర్ విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేయాలని సూచించింది. తెలంగాణాలో జూన్ 15 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో 100 % సిలబస్ పూర్తవుతుందని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి తెలిపింది.