జపాన్ మాజీ ప్రధాని అబే అంత్యక్రియలకు వంద కోట్లు
అంత్యక్రియలు సాదాసీదాగా చేయాలంటున్న జపనీయులు
కోట్లు ఖర్చు చేయడం వల్లే ఏమోస్తోందని మండిపాటు
అంత్యక్రియలు వద్దంటూ నిప్పంటించుకున్న యువకుడు
ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ వారం రోజులుగా ఆందోళనలు
ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన.. జపాన్ మాజీ ప్రధాని అంత్యక్రియల నిర్వహణ అంశాన్ని జపాన్ను కుదిపేస్తోంది. చనిపోయిన మాజీ ప్రధాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేంటని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. వచ్చే వారం జరగనున్న అంత్యక్రియలను సాదాసీదాగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవెంట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడాన్ని దేశంలోని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో షింజో అబే హత్యకు గురయ్యారు. అబే అంత్యక్రియల కోసం జపాన్ ప్రభుత్వం దాదాపు 1.66 బిలియన్ యెన్లను వెచ్చించనుంది. ఈ మొత్తం ఇండియా రూపాయల్లో చెప్పాలంటే అక్షరాల వంద కోట్లు. ఇది క్వీన్ ఎలిజబెత్ II ప్రభుత్వ అంత్యక్రియల ఖర్చు కంటే ఇది చాలా ఎక్కువ అని మీడియా నివేదికలు చెబుతున్నాయ్.

అబే అంత్యక్రియల కోసం కేటాయించిన నిధులకు సంబంధించి అక్కడ స్థానిక యువత ఆందోళనకు దిగుతోంది. అంత్యక్రియల కోసం చేస్తున్న ఖర్చు వివాదాస్పదమవుతోంది. ప్రధాని అంత్యక్రియల కోసం ఈవెంట్ చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అబే అంత్యక్రియలకు, క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు మధ్య ఉన్న పోల్చగా… అది కేవలం 30 కోట్లు లోపు మాత్రమేనంటూ రిపోర్టులు వస్తోండటంతో.. స్థానిక ప్రజలు కస్సుమంటున్నారు. పన్నులను పెంచేసుకుంటూ… ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తున్నారంటూ యువత ఆందోళనకు దిగుతోంది. గతంలో ఒలింపిక్స్ విషయంలోనూ ప్రభుత్వం అంచనా తప్పిందంటూ నిరసనలు మిన్నంటాయి. టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ ప్రభుత్వం $13 బిలియన్లు డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో లక్షా 5 వేల కోట్లు వెచ్చించింది. ముందుగా నుకున్న మొత్తానికి డబుల్ ఖర్చు చేయాల్సి వచ్చింది.

అబే అంత్యక్రియలను నిర్వహణ కాంట్రాక్ట్ టోక్యోకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ మురయామాకు ప్రభుత్వం ఇచ్చింది. ది గార్డియన్ నివేదిక ప్రకారం, జపాన్ ప్రభుత్వం రాష్ట్ర అంత్యక్రియల అంచనా వ్యయం 14 కోట్లుగా ప్రకటించింది. ఐతే భద్రత కోసం 45 కోట్లు వెచ్చిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న అతిథుల కోసం 600 మిలియన్ యెన్లు సుమారుగా 34 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మొత్తంగా ఖజానాకు అంత్యక్రియల బిల్లు 1.7 బిలియన్ యెన్లకు చేరుకోవచ్చని లెక్కలు వేస్తున్నారు. షింజో అబేకు అంత్యక్రియలు నిర్వహించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ… జపాన్ ప్రధాని కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నాడు.


