10 శాతం కమీషన్లపై అసెంబ్లీలో దుమారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏమైందంటే.. ప్రభుత్వ పనుల బిల్లులో 10 శాతం కమీ షన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. పదేండ్లలో ఎవ్వరు ఎప్పడూ ఎంత కమీషన్లు తీసుకున్నారో చర్చ పెడదామమన్నారు. అయితే, వివేకానంద గౌడ్ చేసిన వ్యాఖ్యలను 320 రూల్ ప్రకారం తొలగించినట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ, వివేక్ తన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటిస్తూ, 10 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.