10 గ్రాముల బంగారం కేవలం 25,000 మాత్రమే …..!
ఈ రోజుల్లో సామాన్యులు బంగారం కొన్నే పరిస్థిలో లేదు. అయితే గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతో వస్తుంది. 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 25 వేల నుంచి 30 వేల మధ్యలో ఉండే అవకాశముంది. ఈ మ్యాజిక్ వెనుక లాజిక్ ఏంటో, ఎలానో చూద్దాం. సాధారంగా ఈ రోజుల్లో 10 గ్రామాల బంగారం ఖరీదు 70,000 నుంచి 80,000 వరుకు ఉంటుంది. సామాన్యుడు కొనే అవకాశం లేదు. ప్రసుత్తం అది కూడా చాలా మంది 24, 22 క్యారెట్ల గోల్డ్ తీసుకోడానికే ఇష్టపడుతారు. గోల్డ్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని కేంద్రప్రభుత్వం 9 క్యారెట్ల గోల్డ్ ని ప్రజలలో తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మన మహిళలు తక్కువకి వస్తుంది అంటే అందులో ఎదో ఒక లోపం ఉంటుంది అనుకుంటారు , కానీ అందులో భయపడాల్సిన ఏ మాత్రం అవసరం ఏమి లేదు. పేద , మధ్య తరగతికి వాళ్ళకి కూడా బంగారం అనేది అందుబాటులో ఉండాలిని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే కనుక నిజం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బంగారం అందుబాటులో వస్తుంది.