1 పెద్దపులి..2 డ్రోన్లు..90 మంది సిబ్బంది..144 సెక్షన్
అంకెలు చూడటానికి ఎంత సీక్వెన్సీగా ఉన్నాయో…పెద్దపులి కోసం వేట కూడా అంతే క్రమశిక్షణతో ప్రణాళికాబద్దంగా సాగుతోంది.ఇదంతా కొమురం భీం జిల్లాలో శుక్రవారం జరిగిన మహిళపై పెద్దపులి దాడి నేపథ్యంలో జరగున్న ఉత్కంఠభరితమైన ఎపిసోడ్.ఒకే ఒక పులిని పట్టుకోవడానకి ఫారెస్ట్,పోలీసు,రెవిన్యూ తదితర శాఖ అధికారులంతా అడవిని జల్లెడ పడుతున్నారు.దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానాన్ని కూడా వినియోగిస్తున్నారు. డేగకళ్ల డ్రోన్‌లతో పులి కోసం పగడ్బంధీ వేట సాగిస్తున్నారు.90 మంది సిబ్బందితో అణువణువూ గాలిస్తున్నారు. దీని కోసం ఏకంగా 15 గ్రామాల్లో 144 సెక్షన్ కూడా విధించారు.అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.