Home Page SliderNational

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

ఢిల్లీ మద్యంకేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. గతంలో ఈడీ కేసులో బెయిల్ పొందిన కేజ్రీవాల్, సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు. ఇటీవల ఆయనకు సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటి సీఎం మనీష్‌సిసోడియాకు బెయిల్ లభించింది. 18 నెలల అనంతరం ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. విచారణ లేకుండా నిందితులను జైలులో ఉంచరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనితో మనీష్‌కు బెయిల్ లభించింది. అయితే ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు నేడు హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా నిరాకరించారు.