News Alert

సినీ నటుడు నాజర్‌కు ప్రమాదం..

ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో షూటింగ్ సందర్భంగా మెట్లు దిగుతున్న సమయంలో నాజర్ జారిపడ్డారు. ఎడమ కన్ను కింద కణితి భాగంలో స్వల్ప గాయమై రక్తస్రావం కావడంతో ఆయన్ను చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిక్సిత కొనసాగుతోంది. నాజర్‌తో పాటు మెహ్రీన్, సుహాసిని, షియాజీ షిండే కూడా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నాజర్‌కు తెలుగులోనే కాకుండా ఇతర భాషాల్లోనూ అభిమానులు ఉన్నారు. చాలా చిత్రాల్లో నాజర్ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం యాక్టింగ్‌లోనే కాకుండా ప్లే బ్యాక్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా పని చేశారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. తాజాగా సినిమా షూటింగ్‌లో నాజర్ గాయపడినట్లు తెలియడంతో సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.