సీఎంకు స్వల్ప అస్వస్థత
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు, ఊపిరితి త్తుల్లో ఇన్ ఫ్లమేషన్ సమస్యలతో సీఎం బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా ఆయన మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫ్లమేషన్ వల్ల గుండెపై ఒత్తిడి పెరిగిందని, తద్వారా రక్త ప్రసర ణలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని పరీక్షల్లో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. భగవంత్ మాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరంలేదని విడుదల చేసిన బులెటిన్ లో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. శుక్రవారం ఉదయం ఆయా పరీక్షల ఫలితాలు వస్తాయని వివరించాయి.

