InternationalNews

సానియా-షోయబ్‌ విడిపోనున్నారా..?

హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోనున్నారా..? వాళ్లిద్దరి మధ్య సఖ్యత లేదా..? విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారా..? 12 ఏళ్ల వీళ్ల వివాహ బంధానికి తెరపడనుందా..? ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఓ టెలివిజన్‌ షోలో సానియా గురించి షోయబ్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలు, ఇన్‌స్టాలో సానియా పోస్ట్‌ చూసినా వాళ్లిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే సంకేతాలిస్తోంది. ఓ టీవీ షోలో సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీల గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆమెకు ఎక్కడెక్కడ అకాడమీలు ఉన్నాయో తనకు తెలియదని షోయబ్‌ అన్నాడు. దీంతో ‘నువ్వేమి భర్తవయ్యా’ అని మరో క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ అన్నాడు. సానియా కూడా ‘బద్ధలైన హృదయాలు ఇంకెక్కడికి వెళ్తాయి.. అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయి’ అని ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌.. షోయబ్‌తో ఆమెకు సంబంధాలు సరిగ్గా లేవనే సంకేతాలిస్తోంది.

వేర్వేరుగా జీవిస్తున్న సానియా, షోయబ్‌..

ఏప్రిల్‌ 2010లో పెళ్లి చేసుకున్న సానియా-షోయబ్‌లకు 2018లో కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ జన్మించాడు. వీళ్లు దుబాయలోని అత్యంత ఖరీదైన పామ్‌జుమేరా ఐలాండ్‌లోని ఓ విలాసవంతమైన విల్లాలో ఉన్నారు. అయితే.. కుమారుడి స్కూల్‌ కోసం ఇటీవల దుబాయ్‌లోనే కొత్త ఇల్లు కొని అక్కడికి షిఫ్ట్‌ అయ్యారు. కానీ.. విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నారని వార్తలొస్తున్నాయి. పాక్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్‌ చేసిన హాట్‌ ఫోటో షూట్‌ వల్లే వీరి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఆ మోడల్‌తో షోయబ్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా పుకార్లు వచ్చాయి. సానియా, షోయబ్‌ నోరు తెరిస్తేనే విడాకులపై వస్తున్న వదంతులకు తెరపడనుంది.