Home Page SliderTelangana

శేఖర్ మాస్టర్ ఇలాంటివి మానుకోండి.. యువతి ఆవేదన..

డాన్స్ మాస్టర్ శేఖర్ కొరియోగ్రాఫర్ పై సోషల్ మీడియాలో ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకర స్టెప్పులతో డాన్స్ చేయొద్దని కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల కొన్ని సినిమాల్లో స్టెప్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ ఇండస్ట్రీకి రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో డాన్స్ మరింత అసభ్యకరంగా మారిందని అది రానున్న కాలంలో చాలా ప్రమాదకరం అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.