Andhra PradeshHome Page Slider

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ ఝలక్.. అసలుకే మోసమా!?

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కేసీఆర్ మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, “దుష్ప్రవర్తన”పై నిషేధం విధించింది. ఏప్రిల్ 5 న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో BRS చీఫ్ చేసిన ప్రకటనలను “తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ECI తెలిపింది. సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ రావు కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నిరంజన్ ఏప్రిల్ 6న ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ECI చర్య తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై ECI నిషేధంపై కేసీఆర్ స్పందించారు. బస్సు యాత్ర మధ్యలో, మహబూబాబాద్‌లో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్‌షో సమావేశంలో ప్రసంగిస్తూ, ECI ఆంక్షలతో తాను 48 గంటల పాటు పెద్దగా మాట్లాడలేనని అన్నారు.

ఐతే కేసీఆర్ ప్రచారంపై నిషేధంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. రానున్న 96 గంటల్లో మరింత గట్టిగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈసీ నిర్ణయంపై BRS ఆన్‌లైన్ ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కేసీఆర్‌పై నిషేధం, కాంగ్రెస్, బిజెపి పన్నిన కుట్ర అని పేర్కొంది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్‌చార్జి అధికారులు తెలుగు వారు కాదని, తెలుగు స్థానిక మాండలికం అర్థం కావడం లేదని కేసీఆర్ తన సమాధానంలో చెప్పారని ఈసీ పేర్కొంది. అయితే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించేలా ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈసీ నిషేధం విధించింది. సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ ఉల్లంఘనలకు సంబంధించినవి కాదని ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 5, 2024న సిరిసిల్లలో అభ్యంతరకర, అవమానకరమైన మాటలను కమిషన్ గుర్తించిందని పేర్కొంది. గత ఎన్నికల సమయంలో MCC నిబంధనలను కూడా కేసీఆర్ ఉల్లంఘించారు. 2019 మే 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభ అనంతరం ఎంసీసీని ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలని చంద్రశేఖర్‌రావును ఆదేశించారని గుర్తు చేసింది.

టైమ్‌లైన్
ఏప్రిల్ 5 – సిరిసిల్లలో కేసీఆర్ విలేకరుల సమావేశం, కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులపై వ్యాఖ్యలు
ఏప్రిల్ 6 – కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు
ఏప్రిల్ 16 – కేసీఆర్‌కు ఈసీ నోటీసు, ఏప్రిల్ 18 వరకు సమయం కోరిన బీఆర్ఎస్.
ఏప్రిల్ 23 – ఈసీకి కేసీఆర్ స్పందన
మే 1 – కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధిస్తూ ఈసీ ఉత్తర్వులు