మహేశ్ బాబు జిమ్ వీడియో వైరల్
సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా SSMB 29 కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ లో కనిపించారు. మహేశ్ బాబు ఒకే ఒక్క వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జిమ్‌లో అద్దం ముందు చూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జక్కన్న సినిమా కోసం మహేశ్ బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికే లుక్స్ మార్చేసిన మహేశ్.. జిమ్ లో వర్కాట్స్ చేస్తూ శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ జిమ్ లో వరౌట్స్ తర్వాత అలా నడుస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో అతను తనను తాను అద్దంలో చూసుకుంటూ సింపుల్ గా గడ్డం సవరించుకుంటున్నాడు. ప్రస్తుతం వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి దూసుకెళుతోంది.