Home Page SliderInternational

భార్య కోసం ఓ భర్త ఏం చేశాడంటే..

చాలా మంది తమ భార్యను ఇంప్రెస్ చేయడానికి షాపింగ్ కి తీసుకెళ్లి మరి చీరను లేదా నెక్లెస్ లను కొని పెడతారు. కానీ ఓ మిలియనీర్ భర్త భార్యపై ఉన్న ప్రేమతో ఏకంగా ఒక ఐలాండ్ నే కొనేశాడట. తన భార్య బికినీ వేసుకుని సేఫ్ గా ఉండటం కోసం ఈ పని చేశాడట. ఈ భార్య భర్తల అనురాగం, అప్యాయత, ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహా సముద్రంలో ఓ ఐలాండ్ ను కొనుగోలు చేశాడట. దానికోసం ఆయన పెట్టిన ఖర్చు 50 మిలియన్ల డాలర్లు. అంటే అక్షరాలా రూ.418 కోట్లు. ఆమె ఈ విషయాన్ని ఇన్స్ట్ గ్రామ్ ద్వారా వెల్లడించింది. ఆ ఐలాండ్ ఆసియా ఖండంలోనిదేనని చెప్పినప్పటికీ.. పూర్తి వివరాలు మాత్రం బయట పెట్టలేదు. వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా చూశారు. 67 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు విచిత్రమైన కామెంట్లు షేర్ చేస్తున్నారు. “అతడు అంత ధనవంతుడైతే.. ఛార్టర్డ్ విమానం ఎందుకు లేదో..?”, “ఇలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడో చెప్తారా..?” అంటూ పలువురు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.