ప్రధాని మోదీ , సీఎం చంద్రబాబు స్నేహం రాజకీయం కోసమే
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల స్నేహం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమేనని, వారి హృదయాలు ఎప్పుడూ కలవవని మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తెచ్చే చంద్రబాబు… తన సొంత హెరిటేజ్ కార్యాలయం, జగన్ భారతి సిమెంట్స్‌ను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు తీసుకురావడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు.రాజమండ్రిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , రాజమహేంద్రవరం కోనసీమలో కొబ్బరి చెట్ల నష్టానికి తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని ఉండవల్లి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని నేను నమ్ముతున్నా. అలాంటివాడు ఇలా రాష్ట్రాల మధ్య విభేదాలు రేపే మాటలు మాట్లాడటం దురదృష్టమని వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికార పార్టీ అయిన టిడిపి, ప్రతిపక్ష వైసీపీ రెండూ మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ విమర్శలు చేశారు.హిందుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.పాంచజన్యం పుస్తకం చదివాకే నేను ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బయటికి వచ్చాను. 1964లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది – హిందుత్వం మతం కాదు, సనాతన ధర్మానికి చెందిన జీవన విధానం మాత్రమేనని తెలిపారు.బీజేపీ హిందూ మతాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకుంటోందని విమర్శించిన ఆయన, ఉత్తరాది తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.పాకిస్థాన్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకునే పాక్ టెర్రరిస్టులను చూస్తూనే కాల్చిపారేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

