Andhra PradeshHome Page Slider

నేను పార్టీ మారడం లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తాను వైసీపీ పార్టీని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారి టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు అబద్దపు ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. జగన్ తనకు ఎన్నో అవకాశాలు కల్పించారని, ఊపిరి ఉన్నంత వరకూ జగన్‌తోనే ఉంటానని, వేరే పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడనని ప్రమాణం చేశారు. రాబోయే ఐదేళ్ల పాటు ప్రజలతోనే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాట ఇచ్చారు. 2029లో తిరిగి జగన్‌ను, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.