నా వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారు
తిరుమల లడ్డూ వివాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఇటీవలే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. అసలు హిందువుల గురించి నేను మాట్లాడితే ఆయనకు సంబంధం ఏంటి? అని పవన్ ప్రశ్నించారు. నేను వేరొక మతాన్ని నిందించానా? క్రిస్టియన్, ఇస్లాం మతాల గురించి తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే గోల చేస్తున్నారని అంటున్నారు. అయితే.. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్‌రాజ్ స్పందించారు. ‘‘నా వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత వచ్చి అన్నింటికీ సమాధానం చెబుతాను. వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి’’ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.