ట్రెండీ లీడర్‌లా మారుతున్న కేటిఆర్
కార్యకర్తకు కష్టం అని తెలియగానే నేరుగా కార్యకర్తకే ఫోన్ చేసి…నీ కుటుంబం బాధ్యత నాది అని భరోసానిచ్చే లీడర్ అరుదుగా ఉంటారు.అరుదుగా ఏంది….దాదాపుగా అసలు ఉండనే ఉండరు.కానీ తెలంగాణలో కేటిఆర్ ట్రెండీ పాలిటిక్స్ చేస్తున్నారు.వీధి పోరాటాలు చేసే బీ.ఆర్.ఎస్ .కార్యకర్తకు సైతం తాను అండగా ఉంటానని నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.దీంతో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకుంటున్నారు.ఇందులో భాగంగా సిరిసిల్లలో ఓ తోపుడు బండి నిర్వాహకుడు కేసిఆర్ ఫోటో పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు …మున్సిపల్ అధికారుల చేత అతని దుకాణాన్ని మూసివేయించారు.దీంతో అతను మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబంతో సహా ధర్నాకు దిగాడు.విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కేటిఆర్…బాధితుడు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి అతని కుటుంబానికి అండగా ఉంటానని, తొందర్లోనే కొత్త దుకాణం పెట్టించి తానే ఓపెన్ చేస్తానని ధైర్యానిచ్చాడు కేటీఆర్.దీంతో ఇలాంటి లీడరే కదా కావాల్సింది ప్రతీ పార్టీకి అంటూ…నెటిజన్లు పొరుగు పార్టీలను తెగ ట్రోల్ చేస్తున్నారు.