అగ్రనేతల ఓటమి..కష్టాల్లో ఆప్
ఆప్ అగ్రనేతలు మాజీ సీఎం కేజ్రీవాల్, సీఎం ఆతిశీ, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా వంటి హేమాహేమీలు కూడా వెనుకంజలో పడ్డారు. న్యూఢిల్లీ నియోజక వర్గంలో ఓటమి పాలయ్యారు మాజీ సీఎం. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గెలుపు సాధించారు. జంగ్‌పురాలో సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. సీఎం ఆతిశీ కల్కాజీలో మొదటి నుండి వెనుకంజలోనే ఉన్నారు. దీనితో ఆప్ పార్టీ దాదాపు అధికారంపై ఆశలు వదులుకున్నట్లే అని రాజకీయవేత్తలు అంటున్నారు. మరోపక్క బీజేపీ దాదాపు 46 స్థానాలలో ఆధిక్యతలో దూసుకెళుతూండడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళుతోంది. ఆప్ 24 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.

