కరెన్సీ నోట్‌పై ఉన్న గాంధీ బొమ్మను తీసేయండి…
ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేసింది. డిజిటల్ కరెన్సీని రిటైల్, హోల్‌సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ, ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో పరీక్షిస్తున్నారు. ఈ రూపీపై మహాత్మాగాంధీ ఫోటో లేకపోవడంతో గాంధీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపై బాపూ బొమ్మ వేయనందుకు ఆర్బీఐకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. ఇప్పడు దయ చేసి ఆయన ఫోటోని పేపర్ కరెన్సీపై నుండి తొలగించండి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే.. తుషార్ గాంధీ చేసిన ఈ ట్విట్‌పై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.