ఓవర్ టేక్ చేస్తూ పల్టీలు కొట్టిన వాటర్ ట్యాంకర్
బెంగళూరులోని దొమ్మసంద్ర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్, లారీని ఓవర్ టేక్ చేస్తుండగా, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమీపంలోని కారు #డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. సోమవారం వైట్ ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసు పరిధిలో జరిగింది ఈ ఘటన. రోడ్ యాక్సిడెంట్ లో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.