ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోండి
అన్యాయం జరగకుండా కేంద్రం అన్నీ రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని, డీలిమిటేషన్ విధివిధానాలపై ఇంకా చర్చే జరగలేదని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కిషన్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదంటూ హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై దృష్టి పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం జరిగిన సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి విమర్శించారు.రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలపై దృష్టిపెడితే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్‌పై రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చేస్తారని మొన్నటి ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.
