Home Page SliderNationalSportsviral

‘ఇంగ్లండ్ టూర్‌లో శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు ..?’ మండిపడ్డ గంగూలీ

ఇంగ్లండ్, భారత్ మధ్య జూన్ 20 నుంచి అయిదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మండిపడ్డాడు. ‘గత సంవత్సరం నుంచి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ వేగంగా పరుగులు రాబడుతున్నాడు. షార్ట్ బాల్స్ కూడా చక్కగా ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ భిన్నమైన ఫార్మాట్ అయినప్పటికీ అతడికి జట్టులో చోటు కల్పించి ఉండాల్సింది’ అని గంగూలీ అన్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ టీమ్ కి సారథ్యం వహించాడు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ భర్తీ చేయగల ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ పేరు ముందు వరుసలో నిలిచింది. కానీ అనూహ్యంగా అతడికి ఇంగ్లండ్ టూర్ వెళ్లే భారత జట్టులో చోటు దక్కలేదు. దీనిపై గంగూలీ ప్రతిస్పందించాడు.