గుండె సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి….!
శరీరంలో బరువు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉండటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. లావుగా ఉన్న వారిలో శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది వివిధ వ్యాధులకు దారి తీస్తాయి . అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే వెయిట్ కంట్రోల్ లో ఉండాలి. కాబట్టి గుండె సమస్యతో బాధపడుతున్నప్పుడు బరువు తగ్గడం చాలా ముఖ్యం.
గుండె సమస్య ఉంటే, సన్నబడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, గుండె రోగులకు విషంతో సమానం. కాబట్టి రోజువారీ ఆహార జాబితాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. ఈ రకమైన ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు కంట్రోల్ ఉంచడానికి తోడ్పడుతుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో యాపిల్స్, ఆరెంజ్, లెంటిల్స్, బ్రౌకోలీ, గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి . అప్పుడే మనం గుండె సమస్య నుంచి బయటపడగలం.

