Home Page SliderInternational

విమానం ఇంజన్‌లోకి వెళ్లిన కుందేలు.. తర్వాత ఏమైందంటే..

ఓ విమానం ఇంజన్‌లోకి కుందేలు వెళ్లింది. దీంతో ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్‌లో మంటలు రావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు. రన్ వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌లోకి కుందేలు వెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్ లో జరిగింది. డెన్వర్ నుండి ఎడ్మింటన్‌కు వెళ్తున్న విమానంలో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడం గుర్తించి, విమానాన్ని వెనక్కి మళ్లించి పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పింది.