IPLలో సరికొత్త రికార్డు సృష్టించిన సిరాజ్
ఈ IPL సీజన్‌లో ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. ప్రత్యర్థి జట్టులకు గట్టి పోటి ఇవ్వడమే కాకుండా IPLలో అనేక సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RCB ప్లేయర్ సిరాజ్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. కాగా ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచుల్లో 20 ఓవర్లు బౌలింగ్ వేసి అత్యధికంగా 69 డాట్ బాల్స్ ఇచ్చి నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో కూడా అదరగొట్టి 72 బంతులేసి 51బంతులకు పరుగులివ్వకుండా సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్ తర్వాతి స్థానంలో షమీ(65),జోసెఫ్(48),మార్క్ ఉడ్(48),అర్ష్ దీప్(45),భువనేశ్వర్(45),రషీద్ ఖాన్(45) ఉన్నారు.

