NationalNews

ఆస్పత్రిలో పంజాబ్ సీఎంకు చికిత్స

Share with

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయన ఉదయం ఆసుపత్రిలో చేరారు. ఆయన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.ఈ మేరకు పంజాబ్ సీఎం మాన్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు ఇన్ ఫెక్షన్ సోకిందని అపోలో వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన సమీప బంధువు గురు ప్రీత్ కౌర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన  ప్రముఖ పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్‌కు మట్టుపెట్టడంపై ఆయన అభినందనలు తెలిపారు.