ఈడీ ముందుకు సోనియా..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేషనల్ హెరాల్ట్ – ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఎన్నో సార్లు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటిసులు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఆరోగ్యం బాగోని కారణంగా , ఆ విచారణకు రాలేనని ఈడీకి లేఖ ద్వారా తెలిపారు. ఈడీ దానికి సమ్మతిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా గురువారం ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ ఎదుట సోనియా హాజరుకానున్నారు.
ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తగినట్టుగా ఈడీ వ్యవరిస్తోందని… కాంగ్రెస్ పార్టీ నాయకులని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఖండించిన పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఈడీ ఆఫీసు వరకు పాదయాత్ర చేస్తోన్నారు. అలాగే రాజ్‌భవన్ ఎదుట తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన నేతలు దర్యాప్తు సంస్ధల దుర్వినియోగంపై పార్టీ ఎలా స్పందించాలని చర్చించారు. సోనియా గాంథీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.