మాజీ మంత్రి కాకాణిపై PT వారెంట్
నెల్లూరు జిల్లా – అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నెల్లూరు జిల్లా కోర్టు లో వాదనలు ముగిశాయి. ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి ఈ నెల 20కి తీర్పును వాయిదా వేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో CID నమోదు చేసిన కేసులో ఈవాళ పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణిని పోలీసులు హాజరు పరచారు. నెల్లూరు సెంట్రల్ జైల్ నుండి పిటి వారెంట్ పై న్యాయస్థానం ముందు పోలీసులు హాజరు పరచారు. నెల్లూరు కోర్టులో హాజరైన అనంతరం బాపట్ల పోలీసులకు కాకానిని హ్యాండోవర్ చేయనున్నారు పోలీసులు.
ఒకప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో పోలీసు ఎస్కార్ట్ సెక్యూరిటిగా ఉండేది. అదే ఎస్కార్ట్ వాహనంలో నేడు జిల్లా కేంద్ర కారాగారానికి, కోర్టులకు కాకాణి తిరుగుతుండడం విధి రాతంటూ..అక్కడ చూసిన ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

