తెలంగాణాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?
తెలంగాణాతోపాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న కౌంటింగ్‌తోపాటు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఉన్న ఓటర్ల సంఖ్యను కూడా ఈసీ వెల్లడించింది. కాగా తెలంగాణాలో మొత్తం 3,17,17,789 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో 17,01,087 మంది కొత్త ఓటర్లు ఉన్నారని పేర్కొంది. అయితే 6,10,694 మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ వెల్లడించింది. కాగా తెలంగాణా రాష్ట్రంలో స్త్రీ,పురుష నిష్పత్తి 998గా ఉన్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయస్సు ఉన్న యువ ఓటర్లు 3,35,043గా ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5.06 లక్షలు,80 ఏళ్లు పైబడినవారు 4.44లక్షలు ఉండగా..100 ఏళ్లు పైబడిన వారు 7,005 మంది ఉన్నారు.