Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

నోరు విప్పిన పరకామణి చోరీ నిందితుడు

తిరుమల పరకామణిలో చోరీ జరిగిన వ్యవహారంపై నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీయర్ మఠం గుమాస్తా పీవీ రవికుమార్ సుదీర్ఘ కాలం తర్వాత శనివారం నోరు విప్పారు. “నేను తప్పు చేశాను. పరిహారం చెల్లించాను. జీయర్ మఠం గుమాస్తాగానే కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన సొమ్ములో 90 శాతం టీటీడీకి సమర్పించా” అని స్పష్టం చేశారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కేసును “చాలా చిన్నది” అని వ్యాఖ్యానించిన మరుసటి రోజే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విచారణపై ప్రశ్నలు లేవనెత్తిన 24 గంటలు కూడా తిరగకుండానే రవికుమార్ వీడియో విడుదల చేయడం చర్చకు దారితీసింది. భూమన కరుణాకరరెడ్డి, వైఎస్. సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు తమను విచారించారని, కానీ బీఆర్ నాయుడు సారధ్యంలోని ప్రస్తుత బోర్డులో ఉన్న వైసీపీ సభ్యులను ఎందుకు విచారణకు పిలవలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య విడుదలైన రవికుమార్ వీడియో సందేశంలో, తనను కొందరు బ్లాక్ మెయిల్ చేశారని కూడా ఆరోపించారు. పట్టుచీర బ్యాక్‌గ్రౌండ్‌లో రవికుమార్ మాట్లాడిన ఈ వీడియో, ఆయన ఎక్కడున్నారు అనే విషయం చెప్పకుండానే విడుదల కావడం ఆసక్తికరంగా మారింది.