HealthHome Page SliderNational

మంచి కొలెస్ట్రాల్‌ను ఇలా పెంచుకుందాం..

ఆరోగ్యానికి మేలుచేసే మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండడం కూడా అవసరమే. ఈ మంచి కొవ్వును పెంచుకుంటే అందం, ఆరోగ్యం రెండూ పెంపొందించుకోవచ్చు. దీనిని సులభంగా పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. మందుల కంటే సహజ సిద్ధంగా ఈ కొవ్వును పెంచుకుంటే అవి గుండెజబ్బు ముప్పును కూడా అరికడతాయి. మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదులను పెంచుకోవాలంటే మంచి వ్యాయామం, శారీరక శ్రమ బాగా తోడ్పడతాయి. వీటిలో నడక, పరుగు, సైకిల్ తొక్కడం, ఈత, తోటపని, బరువులు ఎత్తడం వంటి పనులు చాలా ఉపయోగపడతాయి.

తాజా కూరగాయలు, పండ్లు, పీచు ఉండే పండ్లు, విటమిన్ సి బాగా ఉండే నారింజ, బత్తాయి వంటి పండ్లు బాగా తీసుకోవాలి. ఓట్స్, పప్పులు, తృణధాన్యాలు, దంపుడు బియ్యం, చేపలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మాంసం, ఉప్పు, నూనెలో వేపుళ్లు తగ్గించాలి.

శరీర బరువు ఎక్కువగా ఉంటే తగ్గే ప్రయత్నాలు చేయాలి. బరువు కాస్త తగ్గితే కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొవ్వు తగ్గుతుంది. ఇలా మంచి ఆహారం అలవాటు చేసుకుంటే మంచి కొవ్వును పెంచుకోవడం చాలా సులువైన పని. దీనిద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి చక్కటి ఆకర్షణ కూడా సంతరించుకుంటుంది.