NewsTelangana

కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం… రేవంత్‌ను ఓ ఆట ఆడుకున్న జగ్గారెడ్డి

Share with

కాంగ్రెస్‌లో అసమ్మతి అన్నది సహజంగా ఉండే స్వభావమని… పార్టీ వ్యవహారాలను నిలదీసే నాయకులతో పార్టీకి మేలు జరిగేదని… కానీ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక… ఆ పదవిని కోవర్ట్ గా మార్చేశాడంటూ విరుచుకుపడ్డాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నాడని… చుట్టూ చిల్లర మనుషులను ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించాడు. సీఎల్పీగా డమ్మీని పెట్టుకొని… ఆయనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డాడు. సీఎల్పీకి చెప్పకుండానే… జిల్లా నేతలకు కండువా కప్పుతున్నారని విమర్శించారు. సీఎల్పీకి మర్యాద ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.

పార్టీ వ్యవహారాలు బయట పెట్టనని రాహుల్‌కు మాట ఇచ్చి… తప్పినందుకు క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు జగ్గారెడ్డి. తనకు హెచ్చరికలు చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. రేవంత్ తమాషాలు చేస్తున్నాడని.. ఆయన కెపాసిటీ ఏంటో నాకు తెలుసనన్నారు. రాహుల్ గాంధీ శత్రువులను సైతం వాటేసుకుంటుంటే…రేవంత్ పార్టీ నేతలను ద్వేషిస్తున్నాడని విమర్శించాడు జగ్గారెడ్డి.