ఒకటే మాట… తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి… డబుల్ ఇంజిన్ గ్రోత్ అభివృద్ధిని ప్రజలకు అందించాలి… ఇదీ బీజేపీ అతిరథమహారధుల నోట వస్తున్న ఏకైక స్వరం. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న సమావేశాల్లో నేతలు తెలంగానం చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతలతోపాటు… కార్యవర్గ సమావేశానికి 18 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంపై పార్టీ నేతలు అభిప్రాయాలు వివరిస్తున్నారు. ఇక దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చిస్తున్నారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంతోపాటు… సామాజిక, ఆర్థిక రాజకీయ తీర్మానాలపై కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అన్నదానిపైనా నేతలు పలు సూచలు చేస్తున్నారు.