ఇకపై నేను బ్యాడ్ మ్యాన్‌నే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఇరాన్ రాయబార కార్యాలయం బ్రిటన్‌లో చేసిన వివాదాస్పద పోస్ట్‌లు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఇరాన్ పాలకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక చేత్తో అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకున్న ఫోటోను జత చేస్తూ, “ఇకపై మంచివాడిలా ఉండను” అనే స్లోగన్‌తో సంచలన పోస్ట్ పెట్టారు. ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్యపరమైన పరిష్కారం త్వరగా లభించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై సంతకం చేయడం కూడా ఇరాన్ పాలకులకు తెలియదని, వారిలో సరైన నిర్ణయాధికారం లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. పాత ఒప్పందం అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని, నేరుగా అణ్వస్త్రాల నిరాయుధీకరణపై చర్చలకు వస్తేనే ముందుకు వెళ్తామని ఆయన తేల్చి చెప్పారు.

