Home Page SliderNews Alerttelangana,

రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కోసం రూ. 1,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేవలం పాత బకాయిలను తీర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ. 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్‌లు, రిటైర్మెంట్ బిల్లులు ఇకపై పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది.