Home Page SliderTelangana

బ్యాట్మింటన్ ఆడిన ముఖ్యమంత్రి

Share with

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్మింటన్ ఆడారు. అక్కడ గల బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ జితేంద‌ర్ గారు సహా ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.