చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఈ కేసులో బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో చంద్రబాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతకొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఈరోజు కూడా విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇరుపక్షాలు 17A పై వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపున సాల్వే వాదనలు వినిపించగా..సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఇవాళ మధ్యహ్నంకి వాయిదా వేసింది. అనంతరం మరోసారి శుక్రవారం మధ్యహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.