కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో 87 కుక్కర్లు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే నాయకులపై పోలీసులు దృష్టిపెట్టారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ప్రెషర్ కుక్కర్లపై తన ఫొటోను ముద్రించి పంపిణీకి సిద్ధం చేయగా పోలీసులు స్వాధీన పరచుకున్నారు.
గచ్చిబౌలి: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే నాయకులపై పోలీసులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ప్రెషర్ కుక్కర్లపై తన ఫొటోను ముద్రించి పంపిణీకి సిద్ధం చేయగా పోలీసులు స్వాధీన పరచుకున్నారు. వివరాలను మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గోపన్‌పల్లి తండాలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందింది. ఏసీబీ శ్రీనివాస్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ జేమ్స్‌బాబు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్త రాములు నాయక్ ఇంట్లో సోదాలు చేపట్టారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫొటో ముద్రించి ఉన్న కుక్కర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు రాములు నాయక్, నర్సింహను అరెస్టు చేశామని, రఘునాథ్ యాదవ్‌పై 171E సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.