555 కేజీల గుమ్మడికాయ పడవతో గిన్నిస్ రికార్డు
అమెరికాలోని ఓరెగాన్‌లో హ్యాపీ వ్యాలీకి చెందిన గుమ్మడి కాయ రైతు గ్యారీ క్రిస్టెన్‌సేన్ అరుదైన రికార్డును సాధించారు. 555 కేజీల గుమ్మడి కాయను పండించి, దాని లోపలి గుజ్జును తీసివేసి, పడవలా తయారు చేశారు. కొలంబియా నదిలో ఏకధాటిగా 26 గంటల పాటు 73.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, కెనడాలోని వాంకోవర్ నది ఒడ్డుకు చేరుకుని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. నది మధ్యలో భారీగా మొక్కలు ఉండడంతో ప్రయాణం కష్టతరంగా మారిందని గ్యారీ పేర్కొన్నాడు. అయితే తాను నది ప్రవాహ మార్గంలో ప్రయాణించడంతో ఈ రికార్డు సాధ్యమయ్యిందని హర్షం వ్యక్తం చేశాడు.