‘మృణాల్‌తో ఫోటో ఇలా’ ..ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఒక వ్యక్తి దీపావళి నాడు మృణాల్ ఠాకూర్‌తో కలిసి బాణాసంచా కాలుస్తున్నట్లు ఇన్‌స్టాలో చూసిన పోస్టుపై నటి మృణాల్ సీరియస్ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ చిత్రంలోని స్టిల్‌ను ఎడిట్ చేసినట్లు పేర్కొంది. ఈ వీడియో చూసి కోపం వచ్చినా, మళ్లీ అతడి పేజీ చూస్తే చాలామంది హీరోయిన్లతో ఫోటో ఎడిటింగ్స్ కనిపించాయని పేర్కొన్నారు. అతడి ఎడిటింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటున్నానని, తన టాలెంట్‌ను సరైన వాటి కోసం ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ఎప్పటికైనా మంచి సినిమా ఎడిట్ చేసే స్థాయికి వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.