చంద్రబాబుతోనే భవిష్యత్తు బాగుపడుతుంది..
అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు): మన ఊరు, మన భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతోపాటు జగన్ అవినీతిపై ప్రజలకు వివరించారు. మాజీ మంత్రి పరిటాల సునీత కనగానపల్లి మండలం గుదివాండ్లపల్లిలో ప్రచారం చేశారు. మార్గమధ్యలో ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించిన సునీత కరపత్రాలు పంపిణీ చేసి ప్రయాణికులకు వివరించారు. అనంతపురంలోని ఎర్రినేల కొట్టాలలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, బ్రహ్మసముద్రం మండలంలోని తీటకల్లులో ఉమా మహేశ్వర నాయుడు, గుంతకల్లులోని బెంచ్ కొట్టాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ తదితరులు కాలనీలు, గ్రామాల్లో కలియతిరిగారు.