స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా ఈ రోజు కూడా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు ధర్మాసనం చంద్రబాబు కేసుపై విచారణ జరపనుంది. కాగా ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని 17A చుట్టూనే వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. అయితే సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చంద్రబాబుకు 17A వర్తించదని వాదిస్తున్నారు. దీంతో సెక్షన్ 17A దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.