శాస్త్రవేత్తకు రైతు నేస్తం అవార్డు
బనగానపల్లి: బనగానపల్లి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నఎం.సుధాకర్ రైతు నేస్తం అవార్డు అందుకున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ జి.ధనలక్ష్మి ఆదివారం తెలిపారు. రైతు నేస్తం 19వ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్టు కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. ప్రతి ఏటా ముప్పవరపు ఫౌండేషన్, రైతు నేస్తం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వ్యవసాయ రంగంలో సేవలందించిన దివంగత పద్మశ్రీ డా.ఐవీ సుబ్బారావు పేరిట ఈ అవార్డును అందిస్తారు. ఈ సందర్భంగా సుధాకర్‌కు అవార్డు రావడంతో తోటి శాస్త్రవేత్తలు బాలరాజు, రమణయ్య, కృష్ణమూర్తి, లక్ష్మీప్రియ, ఆదినారాయణ, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.