NewsTelangana

వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుదామన్న అమిత్ షా

Share with

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు హోం మంత్రి అమిత్ షా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సెక్రటేరియెట్‌కు వెళ్లి బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలన్నది కేసీఆర్ ఆలోచనని… తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలన్నది బీజేపీ యోచనని అన్నారు షా. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్కరోజైనా సచివాలయానికి వచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే భాగ్యం బీజేపీకే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వాలన్నారు అమత్ షా. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకుతామన్నారు.