NationalNews

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారు-మోదీ దండరో

Share with

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించారని… వరుస ఎన్నికల్లో కమలం పార్టీనీ ఆశీర్వదించారన్నారు. తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్స్ పార్క్ నిర్మించబోతున్నామన్నారు మోదీ. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. త్వరలో డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతుందని… అందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ అన్నారు మోదీ. రాష్ట్రమంతా పరేడ్ గ్రౌండ్లో కూర్చొందన్నారు.