బీజేపీ అధికారంలోకి వచ్చే 20వ రాష్ట్రం తెలంగాణ-ఈటల
తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ముఖం చూడ్డానికి ఇష్టపడటం లేదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో మోదీ ఫోటోలు కన్పించవద్దని కేసీఆర్ కుట్రలు చేశారన్నారు రాజేందర్. 130 కోట్ల జనం గుండెల్లో మోదీ ఫోటో ఉందన్నారు. రూ. 33 కోట్ల రూపాయలతో కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకున్నారని… సిటీలో అనవసరం గా, ఫ్లెక్సీలు, బ్యానర్లతో బీజేపీ కార్యక్రమం హైలెట్ కాగూడదని కుట్రలు చేశారన్నారు ఈటల. దళిత సీఎం అని చెప్పి కేసీఆర్ మాట తప్పాడని… కానీ బీజేపీ ఎస్సీ బిడ్డను రాష్ట్రపతి చేసిందని… ఇప్పుడు ఎస్టీ, మహిళను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టబోతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.