యుద్ద విమానం నడిపిన కేంద్రమంత్రి
ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. ఏరో ఇండియా-2025లో స్వదేశంలో తయారు చేసిన HJT-36 యశస్ అనే జెట్ విమానాన్ని నడిపారు. ఇలా యుద్ద విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. భారత విమానయాన, రక్షణ తయారీ రంగంలో రోజు రోజుకీ స్వదేశీ పరిజ్ఞానం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేసారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది చాలా మంచి అభివృద్ది అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

